ఇంట్లో బూట్లు, చెప్పులు తిరగేసి పెడుతున్నారా..ఇది తెలిస్తే ఎప్పుడూ పెట్టరు 

17 July 2025

Pic Credit: freepik.com 

TV9 Telugu

పిల్లలు ఇంటి దగ్గరకు రాగానే చెప్పులు లేదా బూట్లు విడుస్తూ అవి తలక్రిందులుగా  ఉన్న పట్టించుకోరు. అది చూసిన వెంటనే ఇంటి పెద్దలు. పిల్లల్ని తిట్టి వాటిని సరిగ్గా పెట్టమంటారు.

అయినప్పటికీ.. నేటి యువత పెద్దలు ఎందుకు చెప్పారో అని ఆలోచించరు. నిర్లక్షంగా వాటిని అలాగే ఉంచుతారు. అయితే చెప్పులు లేదా బూట్లు తిరగేసిపెడితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా?

ఈ విషయం మీకు తెలిస్తే.. మీరు  మళ్ళీ ఎప్పటికీ చెప్పులను లేదా బూట్లను తలక్రిందులుగా పెట్టే తప్పు చేయరు.

బూట్లు, చెప్పులు తలక్రిందులుగా పెట్టడం వలన ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు వస్తాయని అంటారు.

చెప్పులు తలక్రిందులుగా కనిపిస్తే వెంటనే వాటిని సరిచేయండి. లేకపోతే లక్ష్మీదేవి కోపం కలుగుతుంది. అప్పుడు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

చెప్పులు తలక్రిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో అనారోగ్యాలు వస్తాయి. అంతేకాకుండా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం కూడా ఉంటుంది.

చెప్పులను తలక్రిందులుగా ఉంచడం వల్ల శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శనిదేవుడు పాదాలకు కారణభూతుడిగా పరిగణించబడతాడు. కనుక చెప్పులను సరిగ్గా పెట్టడం మంచిది.

వాస్తు ప్రకారం చెప్పులు తలక్రిందులుగా ఉంటే.. ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. ఇంటి నుండి సానుకూలత తొలగిపోతుంది. కుటుంబంలోని ఆనందం, శాంతి లోపిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది, TV9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు.