వాన చినుకులు పడగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వర్షంలో తడుస్తారు. ఇలాంటి పరిస్థితిలో వానలో స్నానం చేయడం మంచిదా? హానికరమా తెలుసుకుందాం.
వర్షపు నీరు కళ్ళలోకి పడితే అది కండ్లకలక, చికాకు లేదా వాపుకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందులో ఉండే బ్యాక్టీరియా, దుమ్ము కళ్ళకు హాని కలిగిస్తాయి.
వర్షపు నీరు శుభ్రంగా ఉండదు. అందులో దుమ్ము, రసాయనాలు, బ్యాక్టీరియా ఉండవచ్చు. కనుక చర్మ అలెర్జీలు, దురద , జుట్టు రాలడం జరుగుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వర్షంనీరుతో జాగ్రత్తగా ఉండాలి.
కొంతమంది వర్షంలో తడిసిన తర్వాత చాలా మంది తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడతారు. తడి తల, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు కూడా సైనస్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి.
వర్షంలో తడిసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వర్షంలో తడవడం పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరం.
తడిచిన, మురికి దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దుర్వాసనలు, అలెర్జీలు వస్తాయి. ఈ బ్యాక్టీరియా వెచ్చని, తేమతో కూడిన పరిస్థితులలో త్వరగా పెరుగుతుంది.
ఆర్థరైటిస్ లేదా మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వర్షంలో తడవకుండా ఉండాలి. చల్లటి, మురికి నీరు వీరి సమస్యని మరింత పెంచుతుంది.