ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఉంటే ఏ దిశలో పెట్టుకోవాలంటే..?
03 July 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
తరచుగా ప్రజలు తమ ఇళ్లలో శ్రేయస్సు తీసుకురావడానికి అనేక వస్తువులను ఉంచుకుంటారు. వాటిలో ఒకటి క్రిస్టల్ తాబేలు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో స్పటిక తాబేలు ఉంచుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు , సానుకూల శక్తి లభిస్తాయి. ఇది సంపద , విజయాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ఇంట్లో ఉంచిన స్పటిక తాబేలు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఆర్థిక లాభాలకు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.
వాస్తు ప్రకారం క్రిస్టల్ తాబేళును ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తితో నింపుతాయి.
మతపరమైన నమ్మకం ప్రకారం ఇంట్లో స్పటిక తాబేలు ఉంచుకోవడం ఆర్థిక సమస్యలను అధిగమించడానికి, ఆర్థిక లాభాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడంలో కూడా క్రిస్టల్ తాబేలు సహాయపడుతుంది. ఉద్యోగాలు, పరీక్షలలో విజయం సాధించడానికి క్రిస్టల్ తాబేలును ఉంచుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో స్పటిక తాబేలును ఉంచడానికి ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లోపలికి ఎదురుగా ఉండే ప్లేస్ లో స్పటిక తాబేలును కూడా పెట్టుకోవడం శుభప్రదం.