వాస్తు టిప్స్ : అదృష్టం తీసుకరానున్న గులాబీలు ఎలా అంటే?
Samatha
9 july 2025
Credit: Instagram
వాస్తు శాస్త్రం ప్రకారం సాధారణ గులాబీలు వ్యకి జీవితంలో ప్రతికూలతలను తొలిగించి, అవి శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకొస్తాయంటారు.
అయితే గులాబీలతో కొన్ని రకాల నియమాలు పాటిస్తే వాస్తు సమస్యలు తొలిగిపోతాయంటున్నారు పండితులు. అవి ఏవి అంటే?
శుక్రవారం ప్రతి రాత్రి లక్ష్మీదేవికి తాజా గులాబీని సమర్పించి, దానిని మీ బీరువ లాకర్‌లో పెట్టాలి. దీని వలన గులాబీ మీ ఇంట్లో సంపద వర్షాన్ని కురిపిస్తుందంట.
హనుమంతుడికి మంగళ వారం రోజు నుంచి 11 వారాలపాటు, 11 గులాబీలను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయంటున్నారు పండితులు.
ఒక తమలపాకు తీసుకొని, దానిపై గులాబీ, ఉంచి దానిని అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పై నుంచి ఏడు సార్లు తిప్పి కాల్చడం వలన ఆ వ్యక్తిపై ఉన్న ప్రతి కూల శక్తి తగ్గుతుందంట.
గులాబీ పూలను తెల్లటి వస్త్రంలో చుట్టీ, నాలుగు మూలల్లో ఒకటి మధ్యలో ప్రవహించే నీటిలో వదలడం వలన డబ్బు సమస్యలు తొలిగిపోయి సంతోషంగా ఉంటారు.
శుక్లపక్షం మంగళ వారం రోజున ఎర్రటి గులాబీని గంధం, కుంకుమతో వస్త్రంలో చుట్టీ హనుమాన్ వద్ద పెట్టి పూజ చేసి బీరువాలో పెడితే సంపద పెరుగుతుందంట.
గులాబీలను ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోవడం వలన ప్రతి కూల శక్తి తగ్గిపోయి, సానుకూల శక్తి పెరుగుతందని చెబుతున్నారు నిపుణులు.