శ్రావణ మాసంలో ఈ రాశులవారి గల్లాపెట్టె గలగల..  

04 August 2025

Prudvi Battula 

శ్రావణ మాసంలో కొన్ని రాశులవారికి అదృష్టం, ధనలాభం కలిసివస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంటే వీరికి అన్ని శుభ శకునాలే అన్నమాట.

శ్రావణ మాసంలో వృషభ రాశివారికి ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ధనలాభం కలుగుతుందని పండితులు అంటున్నారు.

మిధున రాశివారికి శ్రావణ మాసంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అదృష్టం కూడా కలుగుతుంది.

సింహం రాశివారి ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రావణ మాసంలో ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యం అంటోంది.

కన్య రాశివారి జాతకం కుజ సంచారం కారణంగా ఈ మాసంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు.

తులా రాశివారి ధన స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రావణ మాసంలో వారికి ధనలాభం కలుగుతుందని పండితులు అంటున్నారు.

మకర ఈ రాశివారికి శుక్రుడు, బృహస్పతి గ్రహాల కలయిక వల్ల ఈ మాసంలో ధనలాభం కలుగుతుంది. అలాగే అదృష్టం కూడా లభిస్తుంది.

కుంభ రాశి వారికి ఈ మాసంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అయితే దాని కోసం కొన్ని ప్రయత్నాలు చెయ్యాల్సి ఉంది.