అప్పులు లేకుండా ఉండే వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది అప్పుల బాధలు, సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు అనడంలో సందేహం లేదు.
కొందరు ప్రాపర్టీ కొనుగోలు చేసి, మరికొందరు అధిక ఖర్చులు, ఇంకొందరు నెల నెల ఈఎమ్‌ఐలు ఇలా ఏదో రకం అప్పులతో సతమతం అవుతుంటారు.
అయితే అప్పులు త్వరగా తీరిపోయి, ఆనందంగా గడపాలి అనుకుంటే తప్పకుండా కొన్ని ఆలయాలు సందర్శించాలి అంటున్నారు పండితులు.
రుణ బాధలతో బాధపడే వ్యక్తులు దక్షిణ భారత దేశంలోని కొన్ని ఆలయాలను సందర్శించడం వలన ఆ సమస్యల నుంచి విముక్తి పొందుతారంట. అవి
రుణ విమోచన లింగేశ్వర ఆలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక్కడ శివుడిని దర్శించుకొని పూజలు చేస్తే అప్పుల బాధలు పోతాయంట.
కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం చిత్తూరు జిల్లాలో ఉంది. కాగా, రుణ సమస్యలు ఉన్న వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే రుణ బాధలు తగ్గుతాయంట.
తమిళనాడులో తిరునాగేశ్వర రాహు దేవస్థానం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే అప్పుల బాధలు తొలిగిపోతాయంటున్నారు పండితులు.
కోనసీమ జిల్లాలో ఉన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానాన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ దేవుడిని దర్శించుకుంటే అప్పుల బాధలు తొలిగిపోతాయంట.