పితృదోష సమస్యలా. ఆషాఢ పౌర్ణమిరోజు చేయాల్సిన పరిహారాలివే!

Samatha

5 july  2025

Credit: Instagram

జూలై 10న ఆషాఢ పౌర్ణమి వస్తుంది. అయితే ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన ధనప్రాప్తి కలుగుతుందంట.

చాలా మంది పితృదోషం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. పితృదోషం ఉంటే ఆ ఇంట చాలా సమస్యలు లుంటాయి.

అయితే అలాంటి వారు ఆషాఢ పూర్ణిమ రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. దీని వలన సమస్యలు తొలిగిపోతాయంట.

 పితృదోషం ఉన్నవారు ఆషాఢ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించాలంట. రావి చెట్టుకు, పంచదార, పాలలు సమర్పించాలంట.

అంతే కాకుండా రావి చెట్టు చుట్టూ, తొమ్మిది ప్రదక్షిణలు చేయాలంట. ఇలా ఆషాఢ పూర్ణిమ రోజు చేయడం వలన  పితృదోషం తొలిగిపోతుందంట

అంతే కాకుండా ఆషాఢ పౌర్ణమి రోజున గొడుగులు దానం చేయడం వలన కూడా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంట.

అలాగే ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యేవారు ఆషాఢ పూర్ణిమ రోజున 11 సార్లు శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరం పఠించడం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయంట.

ఆషాఢ పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపం వెలిగించడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట.