మొదలైన సిరిమాను వేడుక.. ఈసారి ఆ ఊరిపై పైడిమాంబ చల్లని చూపు.. 

17 September 2025

Prudvi Battula 

ఆంధ్రప్రదేశ్‎లోని విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం సిరిమాను ఉత్సవం జరుపుకుంటారు.

సిరి అంటే "లక్ష్మి దేవి, మరో మాటలో చెప్పాలంటే సంపద, శ్రేయస్సు" అని అర్థం మను అంటే "కాండం" లేదా "దుర్గం" అని అర్థం. రెండు కలిపితే సిరిమాను.

సిరిమాను ఉత్సవానికి దాదాపు 15 రోజుల ముందు పైడితల్లమ్మ దేవత ఆలయ పూజారి కలలో కనిపించి ఆ ఏటా సిరిమాను ఎక్కడ దొరుకుతుందో చెబుతుందని నమ్ముతారు.

పూజారి సిరిమాను కోసం వెతుకుతూ వెళ్లి సాంప్రదాయ పూజలు చేసిన తర్వాత సిరిమాను చెట్టును నరికి తీసుకొని వెళ్తారు.

పైడిమాంబ తాను పెంచిన చెట్టును ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తాడు ఆ స్థలం యజమాని. దీంతో అడ్డు చెప్పకుండా చెట్టును అమ్మకి అర్పించుకుంటాడు.

ఈ సారి ఉత్తరాంద్రుల ఇలవేల్పు పైడితల్లమ్మ సిరిమాను చెట్టును విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో గుర్తించారు.

సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు చెట్టుకు బొట్టు పెట్టి సంప్రదాయబద్ధంగా తొలగించి విజయనగరం తరలించారు.

కొండతామరాపల్లి నుంచి తీసుకొచ్చిన చింతామను విజయనగరంలోని హుకుంపేట చేరుకున్న తర్వాత వడ్రంగులు సిరిమానుగా మారుస్తారు.