ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
09 July 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
ఆంజనేయ స్వామికి లేత తమలపాకులతో చేసిన మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడుతున్నవారికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల దండని సమర్పిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.
చిన్న పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడుతుంటే.. ఎంత తిన్నా సన్నగా, నీరసంగా ఉంటే.. ఆ పిల్లలతో స్వామికి తమలపాకుల దండనీ వేస్తే ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా ఎదుగుతారు.
వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పించాలి. తమలపాకులు, అరటి పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
40 రోజుల పాటు సుందర కాండ పారాయణం చేసి ఆంజనేయ స్వామికి తమలపాకుల దండని వేస్తే చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
జాతకంలో శని దోషం, ఏలి నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతుంటే ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి స్వామికి తమలపాకుల హారాన్ని వేసి.. ప్రసాదాన్ని స్వీకరిస్తే రోగాలు నయమవుతాయి.