ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ ఆకలి వేస్తుందా.. జాగ్రత్త సుమా.. ఆరోగ్యానికి ముప్పు
06 July 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా ముఖ్యమైనది. అయితే ఎంత తిన్నా మళ్ళీ ఆకలి వేస్తూ ఏదైనా తినలపిస్తే.. అంటే అతిగా ఆకలితో ఉంటే అది ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించబడుతుంది.
చాలా మందికి చాలా ఆకలిగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు తరచుగా ఆహారం తిన్న తర్వాత కూడా ఆకలిగా ఉంటారు.
మీకు కూడా అవసరానికి మించి ఆకలిగా అనిపిస్తే, అది సాధారణ లక్షణం కాదు. ఎందుకంటే ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి.
అటువంటి పరిస్థితిలో తిన్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ తినలనిపిస్తే అది ఏ వ్యాధి కారణమో తెలుసుకుందాం
డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువ ఆకలిగా అనిపించడానికి కారణం రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగడం.
ఎవరికైనా డయాబెటిస్ వ్యాధి ఉన్నప్పుడు, గ్లూకోజ్ కణాలను చేరుకోదు. దీని వలన శక్తిని కాపాడుకోవడానికి వీరు తరచుగా తినవలసి వస్తుంది.
దీనితో పాటు, థైరాయిడ్ కూడా ఆకలిని పెంచుతుంది. దీని కారణంగా కూడా తరచుగా తినాలని కోరుకుంటారు
అంతేకాకుండా శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నవారికి కూడా ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తరచుగా ఆకలిగా అనిపించడం అనేది నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కూడా కావచ్చు.