గబ్బిలాలు ఎప్పుడూ తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయి? కారణం తెలుసా?

04 July 2025

Pic Credit: freepik.com 

TV9 Telugu

గుహలు, చెట్ల తొర్రెలు, లేదా ఇతర ఎత్తైన ప్రదేశాలలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూసి ఉండవచ్చు. ఇలా వేళాలడం వలన అవి సురక్షితంగా ఉంటాయి.

అయితే వాటిని చూసినప్పుడల్లా.. అవి ఎల్లప్పుడూ ఎందుకు తలక్రిందులుగా వేలాడుతూ కనిపిస్తాయని ఆలోచించరా

గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడుతుంటాయి అని ఆలోచిస్తే.. దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

గబ్బిలాలు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాయి.. ఇలా చేయడం వలన అవి సులభంగా ఎగురుతాయి.

ఎందుకంటే గబ్బిలాలు ఇతర పక్షుల మాదిరిగా నేల నుంచి పైకి ఎగరలేవు. వాటి రెక్కలు నేల నుంచి ఎగరడానికి తగినంత శక్తిని అందించలేవు.

అలాగే  గబ్బిలాల  కాళ్ళు చాలా చిన్నవి. అభివృద్ధి చెందనివి. వీటి పాదాల చీలమండలు, వేళ్ళు సహజంగా బిగుసుకుపోయేలా అమర్చబడి ఉంటాయి

దీని కారణంగా  అవి నేల నుంచి ఎగరలేవు. అందువల్ల అవి వేగంగా ఎగరగలిగేలా తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాయి.

తలక్రిందులుగా వేలాడటం ద్వారా గబ్బిలాలు తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి.