ఆదివారం రోజున అమావాస్య, సూర్యగ్రహణం.. ఈ రాశులు స్టార్ అవ్వడం ఖాయం!
19 September 2025
Samatha
2025 వ సంవత్సరంలో చివరి రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రోజున ఏర్పడ నుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు. కాబట్టి నూతనకాలం చెల్లదు.
ఇక సర్వపితృ అమావాస్య, ఆదివారం రోజున సూర్యగ్రహణం ఏర్పడటం, అలాగే గ్రహణ కాలంలో సూర్య,చంద్రులు, బుధుగ్రహం కన్యా రాశిలో ఉంటారు.
కన్యా రాశి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీని వలన నాలుగు రాశుల వారు స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు.
సింహ రాశి : ఆది వారం రోజున సూర్య గ్రహణం, అమావాస్య కావడంతో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు పోయి, చేతినిండా డబ్బుతో సంతోషంగా ఉంటారు.
తుల రాశి : తుల రాశి వారికి గ్రహణం లక్కు తీసుకొస్తుంది. వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి ఆనందంగా ఉంటారు.
వృషభ రాశి : ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు అద్భుతంగా ఉంటాయి.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.