శ్రీరామనవమి వేళ ఒంటిమిట్ట గురించి కొన్ని విశేషాలు..
06 April 2025
Prudvi Battula
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో నిర్మాంచబడింది ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం.
విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా ఉన్న ఈ ఆలయం జిల్లా కేంద్రం కడప నుండి 25 కిలోమీటర్లు, రాజంపేటకు దగ్గరగా ఉంది.
ఒంటిమిట్టలోని కోదండరామ దేవాలయం సుమారు 16వ శతాబ్దంలో అంటే చోళ మరియు విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది.
ఒంటిమిట్టలో నివసించిన బమ్మెర పోతన తెలుగు భాషలో రచించిన మహా భాగవతాన్ని ఇక్కడ కోలువైన రాముడికి అంకితమిచ్చాడు.
వాల్మీకి రామాయణన్నీ తెలుగులోకి అనువదించినందుకు ‘ఆంధ్ర వాల్మీకి’ అని పిలువబడే వావిలకొలను సుబ్బారావు కూడా ఇక్కడ రాముడిని పూజిస్తూ గడిపారు.
అన్నమాచార్యులు ఈ రామయ్య ఆలయాన్ని సందర్శించి, రాముని స్తుతిస్తూ పాటలు, కీర్తనలను రచించి పాడినట్లు చెబుతారు.
1652లో ఈ ఆలయాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఆలయ నిర్మాణ శైలిని మెచ్చుకున్నారు.
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి అప్పగించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినొచ్చా.?
ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. దక్షిణ భారతంలో ఈ జలపాతాలు..
శ్రీరామనవమికి అయోధ్య వెళ్తున్నారా.? ఇవి తప్పక చూడండి