రేపే పౌర్ణమి.. అస్సలే చేయకూడని ఐదు పనులివే

Samatha

27 August 2026

రేపే శ్రావణ పౌర్ణమి. ఆగస్టు 28న ప్రతి ఒక్కరూ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది.

అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం కూడా ఏర్పడ నుంది. అందువలన ఈరోజు అస్సలే కొన్ని రకాల పనులు చేయకూడదంట.

కాగా, ఇప్పుడు మనం పౌర్ణమి రోజు చేయకూడని పనులు ఏవి? ఎలాంటి పనులు చేయడం వలన సమస్యల్లో చిక్కుకుంటామో చూద్దాం.

పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో గోర్లు , జుట్టు కత్తిరించడం చేయకూడదంట. దీని వలన దురదృష్టం కలుగుతుందంట.

అంతే కాకుండా ఈరోజు మాంసాహారం తినడం అస్సలే మంచిది కాదంట. ఇది పాపంతో సమానం అంటున్నారు పండితులు.

అదే విధంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఇతరులకు అప్పులు ఇవ్వడం కానీ, ఇతరుల నుంచి తీసుకోవడం కానీ చేయకూడదు.

అలాగే ఈ రోజు ఇతరులతో వాదించుకోవడం, తప్పుడు మాటలతో దూషించడం అస్సలే మంచిది కాదని చెబుతున్నారు పండితులు.

నోట్.. పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి