జ్యోతిశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కలలో పాములు రావడం వెనకాల కొన్ని రహస్యాలు ఉన్నాయని అంటున్నారు.
కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం అంటున్నారు జ్యోతిశాస్త్ర పండితులు.
కలలో పాము కనిపించటం వలన మీకు త్వరలో ఆకస్మిక ధన లాభం కలుగబోతోందనడానికి సూచనగా చెబుతున్నారు పండితులు.
అంతేకాదు, మీరు కానీ పెళ్లి అయినవారు అయితే మీకు సంతానం కలుగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు అంటున్నారు.
కలలో పాములు కనిపించడం తీరని కోరికలకు సంకేతం అంటున్నారు.. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి సూచికగా చెబుతున్నారు.
అదే విధంగా కలలో పాము కనిపించి అది నెమ్మదిగా మీ మంచంపై కిందకి వెళ్లిపోతే అప్పుడు మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేనట్టవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు..అదే మీ కలలో కనిపించిన పాము తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలని అంటున్నారు.
కలలో ఎప్పుడైనా గుడిలో పాము ఉన్నట్లు కనిపిస్తే చాలా అద్భుతమైన రాజయోగానికి సంకేతం అంటున్నారు. అలాగే, ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా కూడా చాలా మంచిదంటున్నారు.