ఈ ఫుడ్స్ దూరం పెడితే.. సేఫ్ జోన్‎లో మీ లివర్..

25 July 2025

Prudvi Battula 

వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కొవ్వు మాంసాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అధిక కొవ్వులున్న ఆహారాలు

శీతల పానీయాలు, స్వీట్లు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు కాలేయం దెబ్బతినేలా చేస్తాయి, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అధిక చక్కెరలున్న ఆహారాలు

నీటి నిలుపుదలకు, కాలేయంపై ఒత్తిడికి దారితీస్తుంది. ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్, సోడియం అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి.

అధిక ఉప్పున్న ఆహారాలు

అతిగా మద్యం సేవించడం కాలేయ వ్యాధికి ప్రధాన కారణం, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

ఆల్కహాల్

ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. ఇది కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు

ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. కొవ్వు కాలేయ వ్యాధికి దారితీయవచ్చు. అందుకే వీటిని దూరం పెట్టండి.

వేయించిన, నూనె పదార్థాలు

సరిగ్గా ఉడికించని షెల్‎ఫిష్‎లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా లేదా వైరస్‌లను కలిగి ఉండవచ్చు.  కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులకి హాని కలుగుతుంది.

పచ్చి లేదా సరిగ్గా ఉడికించని షెల్‎ఫిష్‎

తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, పాస్తా రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి. దీని వలన కాలేయంలో కొవ్వు నిల్వ పెరుగుతుంది.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు