ఏ రంగు సీసాలో మనీప్లాంట్ పెంచితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

Samatha

27 August 2026

ఇంటి అలంకరణలో కీలక పాత్ర పోషించేది మనీ ప్లాంట్. ఏ ఇంటిలో అయితే మనీ ప్లాంట్ ఉంటుందో, ఆ ఇల్లు అందంగా కలకలలాడుతూ ఉంటుంది.

వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ ఉండటం చాలా మంచిది అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్  మొక్కను నాటుకుంటారు.

ఈ మొక్కను ఇంటలో నాటుకునే సమయంలో చాలా మంది అనేక అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది గాజు సీసాలో మనీ ప్లాంట్ నాటుకుంటారు.

మరి అసలు ఏ రంగు గాజు సీసాలో మనీ ప్లాంట్ నాటుకోవడం మంచిది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను గజు సీసాలో నాటుకునే ఆలోచన ఉంటే దానికి బెస్ట్ ఎంపిక ఆకు పచ్చరంగు. దీనిలో నాటుకోవడం చాలా మంచిది.

అంతే కాకుండా నీలం రంగు  గాజు సీసాలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవడం కూడా చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు.

గ్రీన్ కలర్ రంగు గాజు సీసాలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన ఇది సంపద పెరుగుదల, బుధ గ్రహం వలన ఇంటిలో ఆనందానికి కారణం అవుతుంది.

అందే విధంగా నీలరంగు గాజు సీసాలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వలన ఇది శాంతి. స్థిరాత్వానికి ప్రతీకగా నిలుస్తుందంట.