భక్తులకు అదిరిపోయే న్యూస్.. టీటీడీ అన్నదానం మెనూలో మరో ఐటమ్!
samatha
21 January 2025
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదం పెడుతారు అనే విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా అన్నం తో పాటు కర్రీ చట్నీ సాంబార్ రసము మజ్జిగతో పాటు చక్కెర పొంగలి భక్తులకు టీటీడీ వడ్డిస్తున్న విషయం తెలిసిందే.
అయితే గత నవంబర్‌లో జరగిన పాలకమండలి తీర్మానం మేరకు అన్న పన్రసాదంలో మరో రకం చేర్చాలని నిర్ణయం తీసుకున్నారంట.
అసలు అన్నప్రసాదంలో మసాలా వడ చేర్చాలా లేక, మరో రకం కర్రీ చేర్చాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది.
అయితే కొన్ని రోజుల పాటు అన్నదానం మెనూలో అల్లవెల్లుల్లి లేకుండా మసాలా వడ భక్తులకు వడ్డించాలని నిర్ణయించుకుందంట.
అయితే, భక్తుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూసి దాని తర్వాత మసాలా వడనే అమలు చేయాలా లేదా అనేదానిపై క్లారిటీ వస్తుందన్నారు అధికారులు.
ఇక తాజాగా టీటీడీ అన్నప్రసాదంలో మసాలా వడను వడ్డించింది. దీనికి విశేష స్పందన వస్తున్నది, దాదాపు ట్రయల్ రన్‌లో భాగంగా 5వేల మంది భక్తులకు మసాలా వడ వడ్డించారు.
ఇక తిరుమల తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలో మూడు పూటలా దాదాపు రెండు లక్షల మందికి టీటీడీ అన్న ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే.