తెలివిగా ఆలోచించిన కాజల్.. కావాలనే ఆ సినిమాలకు నో చెప్పిందా? 

samatha

20 January 2025

చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీ కళ్యాణం సీనిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.

చందమామ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈబ్యూటీ, మగధీర సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది

ఇక మగధీర సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత కాజల్ వరస సినిమాలతో దూసుకెళ్లింది.

అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే?

కాజల్ కొన్ని సినిమాలను రిజక్ట్ చేసిందంట. దాంతో ఈ అమ్మడు ఫ్లాప్ సినిమాలను తప్పించుకుంది అంటున్నారు కొందరు.

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో హీరోయిన్‌గా మొదట కాజల్ అనుకోగా, కాజల్ పెళ్లి పనుల్లో బీజీగా ఉండటం వలన దానిని రిజెక్ట్ చేసిందంట.

అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ నిన్ను కోరి. ఈ మూవీలోని క్యారెక్టర్ తనకు సెట్ కాదని, కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందంట.

రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాను కాజల్ రిజక్ట్ చేసి పెద్ద ఫ్లాప్ నుంచి బయటపడిందంట. అయితే ఈ బ్యూటీ కావాలనే ఈ సినిమా రిజక్ట్ చేసిందని టాక్.