టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాప్ హిట్ మూవీస్ ఇవే!
samatha
19 January 2025
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదం, అభినయం ఈ ముద్దుగుమ్మసొంతం.
ఇక ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సామ్.. తన కెరీర్ బిగినింగ్‌లో వరస సినిమాలో మంచి హిట్స్ అందుకుంది. ఆ సినిమాలు ఏవి అంటే?
నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ఏమాయ చేశావే.. ఈ సినిమాతో సామ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ బృంధావనం సినిమాలో కాజల్, సమంత హీరోయిన్స్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అందుకుంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ఈగ.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అలాగే మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
అలాగే పవన్ కళ్యాణ్, సమంత నటించిన అత్తారింటిదారేది, జూనియర్ ఎన్టీఆర్ సమంత నటించిన జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, ఆఆ వంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం మూవీ, మహేష్ బాబు సరసన నటించిన దూకుడు, యశోద, ఓబేబీ,మజిలీ,రంగస్థలం మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి