రాత్రికి రాత్రే వెలిసిన గుడి.. కట్టినవారెవరో తెలిస్తే భయపడాల్సిందే!

samatha

18 January 2025

Credit: Instagram

 కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఉండే ఆనందం మరేదానిలో ఉండదు. అయితే మనం ఇప్పుడు అలాంటిదే కొత్త విషయం నేర్చుకోబోతున్నాం.

 గుడిని ఎవరైనా మనుషులు కడుతారు. కానీ ఎక్కడైనా దెయ్యాలు గుడి కట్టిన దాఖలాలు ఉన్నాయా? కానీ అక్కడ మాత్రం దెయ్యాలే గుడికట్టాయని చరిత్ర చెబుతోంది.

అసలు ఆ గుడి ఏది? దెయ్యాలు ఎక్కడ గుడిని నిర్మించాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని మధ్యప్రదేశ్ నడిబొడ్డున ఓ పురాతన శివాలంయం ఉంది. దానిపేరు కాకన్మఠ్ టెంపుల్. అయితే దీన్ని దెయ్యాలు కట్టాయి అంటుటారు.

ఈ గుడిని 11వ శతాబ్ధంలో కచ్ఛపఘాట పాలకుడు కీర్తి రాజా ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ టెంపుల్‌కు సంబంధించి అనేక కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

ఇక ఈ టెంపుల్ సిమెంట్ లేకుండా రాళ్లతో అసాధారణంగా నిర్మించి ఉంటుంది. అంతేకాకుండా దీని నుంచి ప్రతిధ్వనులు వినిపిస్తాయి.

అయితే స్థానిక జానపద కథల ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ గుడిని దెయ్యాలు ఒకే రాత్రిలో నిర్మించాయని చెబుతుంటారు. 

అంతే కాకుండా తెల్లవారు జాము వరకు నిర్మాణం కాకపోవడంతో మధ్యలో వదిలేశాయని, అందుకే ఆలయం అసంపూర్తిగా ఉంటుందని వారు విశ్వసిస్తారు.