ఐశ్వర్యా రాజేష్ బాల నటిగా నటించిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

17 January 2025

samatha 

నటి ఐశ్వర్యా రాజేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు టాలీవుడ్‌లో మోత మొగిపోతుంది.

ఐశ్వర్యా రాజేష్ చెన్నైలో జన్మించింది.  ఇక ఈమె తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.  తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో తన నటనతో ఐశ్వర్యా రాజేష్ ఇరగదీసిందనే చెప్పవచ్చు. ఈ మూవీలో తన మాటలు, ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

దీంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈ బ్యూటీ గురించే తెగ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటంటే?

ఐశ్వర్యా రాజేష్ తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి,మిస్ మ్యాచ్, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటించిందని అందరికీ తెలుసు.

కానీ ఈ అమ్మడు తెలుగులో మొదటగా బాల నటిగా ఓ సినిమాలో నటించింద. ఆమె  బాల్యంలోనే బాలనటిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిందంట.

ఇంతకీ ఆ సినిమా ఏది అంటే? టాలీవుడ్ సీనియర్ హీరో  రాజేంద్రప్రసాద్ రాంబంటు సినిమాలో ఐశ్వర్యా రాజేష్ ఓ చిన్న రోల్‌లో మెరిసింది.

ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ రాజేంద్ర ప్రసాద్ కూతురిగా కనిపిస్తుంది.ఏమో గుర్రం ఎగరా వచ్చు అనే పాటలో ఈ బ్యూటీ కనిపిస్తుంది.