ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలో పైడితల్లమ్మ జాతర అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నిర్వహించే సిరిమానోత్సవనికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ ఉత్సవం దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున నిర్వహిస్తారు. సిరిమాను అని పిలువబడే 55 అడుగుల స్తంభంపై పూజారి కూర్చొని ఊరేగింపుగా భక్తులకు ఆశీర్వచనం అందిస్తారు.
సిరిమాను పైడితల్లి అమ్మవారు స్వయంగా ఎన్నుకుంటుంది. పండుగకు 15 రోజుల ముందు ఆలయ పూజారికి కలలో ఎక్కడ ఉందొ చెబుతుందని నమ్మకం.
సిరిమానోత్సవనికి ముందు రోజు అంటే దసరా తర్వాత తొలి సోమవారం నాడు తోలెల్ల ఉత్సవంతో పైడితల్లమ్మ జాతర మొదలవుతుంది.
సిరిమానోత్సవం జరిగిన తర్వాత పన్నిండువ రోజు విజయనగరంలోని పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ సారి అక్టోబర్ 19న జరగనుంది.
విజయనగరం పైడితల్లమ్మ జాతరలో భాగంగా తెప్పోత్సవం తర్వాత కొన్ని రోజులకి ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది.
చండీహోమం ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజ. దీంతో జాతర ముగుస్తుంది. పైడితల్లమ్మ పండగ 20 రోజుల పాటు జరుగుతుంది.
పందిరి రాటతో ఈ పండుగ పనులను ప్రారంభించి కొన్ని రోజుల్లో పూర్తీ చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 ఈ వేడుక జరిగింది.