దేవి నవరాత్రలు.. 9 రోజులు.. 9 ప్రసాదాలు.. ఇలా చేస్తే అదృష్టం.. 

Prudvi Battula 

15 September 2025

నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి దేవిగా పూజలందుకుంటారు. కట్టె పొంగలి, కదంబ వంటి ప్రసాదాలు సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది.

నవరాత్రిలో రెండవ రోజు జగన్మాతని బ్రహ్మచారిణి దేవికి పూజిస్తారు. ఈ రోజున మాతకి పులిహోరను ప్రసాదంగా సమర్పించడం శుభప్రదం.

నవరాత్రులలో మూడవ రోజు జగజ్జనని చంద్రఘంట దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రోజున కొబ్బరి అన్నం, తయిర్ సాదం ప్రసాదంగా సమర్పించవచ్చు.

కూష్మాండ దేవిగా నవరాత్రులలో నాల్గవ రోజు అమ్మవారిని పూజిస్తారు. ఈ ఈరోజు గారెలు ప్రసాదం పెడితే అదృష్టం.

నవరాత్రులలో ఐదవ రోజున స్కందమాత దేవిని పూజిస్తారు. ఈ రోజున అమ్మకి గుగ్గిల్లు ప్రసాదంగా సమర్పిస్తే శుభప్రదం.

అమ్మవారు నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయనీ దేవిగా దర్శనం ఇస్తారు. ఈ రోజున మాతకి పాయసం ప్రసాదంగా సమర్పించవచ్చు.

నవరాత్రులలో ఏడవ రోజు దుర్గమ్మని కాళరాత్రి దేవిగా భక్తులు పుజిస్తుంటారు. ఈ రోజున అమ్మకి కదంబం సమర్పిస్తే మంచిది.

దసరా నవరాత్రి ఎనిమిదవ రోజున భక్తులు మహాగౌరిని పూజిస్తారు. ఈ రోజున కలాడి, పూరి ప్రసాదంగా పెడితే అమ్మ వరాలు అందిస్తుంది.

నవరాత్రులు తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. చలిమిడి, పానకం, లడ్డు వంటివి ప్రసాదంగా ఈ రోజున సమర్పిస్తారు.