ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు అక్కడ ఉంచితేనే శుభప్రదం..
31 August 2025
Prudvi Battula
చనిపోయిన వ్యక్తి చిత్రపటాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలి అనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వ్యక్తి చిత్రపటాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, చనిపోయిన వ్యక్తి (పూర్వీకులు) ఫోటోను ఇంటి ఉత్తర గోడపై దక్షిణం వైపు చూస్తూ ఉంచాలి.
దక్షిణ దిశను పూర్వీకులు, యమరాజు దిశగా పరిగణిస్తారు. కాబట్టి మరణించిన వ్యక్తి చిత్రపటాన్ని ఉత్తర గోడపై ఉంచడం శుభప్రదం.
చనిపోయిన వ్యక్తి ఫోటోను బెడ్ రూమ్, వంటగది లేదా పూజ గదిలో ఉంచవద్దు. దానిని జీవించి ఉన్న వ్యక్తి ఫోటోతో పాటు ఎప్పుడూ ఉంచవద్దు.
మరణించిన తల్లిదండ్రుల చిత్రపటాన్ని గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపించే ప్రదేశంలో ఉంచకూడదు. ప్రార్థనా స్థలంలో లేదా జీవించి ఉన్న వ్యక్తులతో ఉంచకూడదు.
మరణించిన వ్యక్తి ఫోటోను లివింగ్ రూమ్, దక్షిణ లేదా నైరుతి గోడపై ఉంచవచ్చు. పూర్వీకుల ఫోటోను భూమి నుండి దాదాపు 6 అడుగుల ఎత్తులో ఉంచాలి.
చనిపోయిన వ్యక్తి ఫోటోలను అతిథులు చూసే ప్రదేశంలో ఉంచకూడదు. పూర్వీకుల ఫోటోలను వేలాడదీయడానికి బదులుగా చెక్క స్టాండ్‌పై ఉంచడం కూడా మంచిదంటున్నారు వాస్తు నిపుణులు.
ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడం మాత్రమే కాదు. మీ కుటుంబనికి కూడా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.