గర్భిణీలను పాములు కాటు వేయవంటారు? ఇది నిజమేనా?

06 october 2025

Samatha

పెద్ద వారు చెబుతుంటారు, గర్భిణీలను పాములు కుట్టవు అని, మరి నిజంగానే గర్భిణీలను పాములు కుట్టవా? దీని వెనుకున్న రహాస్యం ఏంటో తెలుసుకుందాం.

సమాజంలో అనేక జానపద కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. కొందరు వాటిని కొట్టిపారేస్తే, మరికొందరు నమ్ముతారు.

అయితే చాలా మంది గర్భిణీలను పాములు కుట్టవంటారు. ఎందుకంటే? దీని వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది. ఒక స్త్రీ శివాలయంలో ధ్యానం చేస్తుంది.

అప్పుడు రెండు పాములు ఆమెను బాధపట్టాయంట. అప్పుడు కోపంతో ఉన్న గర్భిణీ సర్పజాతిని శపించి, గర్భంతో ఉన్న స్త్రీ వద్దకు వచ్చిన పాము, అంధత్వం చెందు అని శాపం పెట్టాడంట.

అప్పటి నుంచి పాములు గర్భిణీలను కట్టవు అనే కథ ప్రాచుర్యంలో ఉంది. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అంటున్నారు నిపుణులు.

ఎందుకంటే? గర్భిణీలను పాములు కుట్టవు అనేది ఓ జానపద కథ మాత్రమే, దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదంట.

పాము విషం అనేది చాలా ప్రమాదకరం, అది స్త్రీ నుంచి పిండంలోపలికి ప్రవేశిస్తుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

అందుకే ఎప్పుడూ కూడా గర్భిణీలు పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చిత్తడి ప్రదేశాల్లో ఉండకూడదు, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట.