నల్ల పిల్లి ఎదురొస్తే అశుభమా.? వాస్తవం ఏంటి.?

23 July 2025

Prudvi Battula 

పురాతన విశ్వాసాల ప్రకారం.. పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం కాదు.

పిల్లి ఎడమ నుంచి కుడి వైపునకు కదిలితే అశుభం. కుడి నుంచి ఎడమ వైపునకు కదిలితే శుభసూచికమని, ఇక పిల్లి ఏడుపు కూడా అశుభంగా పేర్కొంటారు.

పూర్వకాలంలో ప్రజలు అడవి గుండా వెళ్లేవారు. రహదారులు సరిగా లేని సమయంలో నడచుకుంటూ వెళ్లేవారు. చీకట్లో సైతం ప్రయాణాలు సాగించేవారు.

ఆ సమయంలో వారి దారికి పిల్లి ఎదురొస్తే వెనుక ఏదో అడవి జంతువు ఉంటుందని పసిగట్టేవారు. దాంతో వారు జాగ్రత్తపడి భద్రత కలిగిన ప్రదేశాల్లో తలదాచుకునేవారు.

రాత్రి వేళ పిల్లులు వేటాడుతుంటాయి. రాత్రిళ్లు వాటి కళ్లు భయంకరంగా ఉంటాయి. గుర్రాలు, ఎద్దుల బండ్లపై ప్రయాణం చేసే బాటసారులు రాత్రిపూట పిల్లి కళ్లను చూసి భయపడేవారు.

ఆ సమయంలో ప్రజలు తమ జంతువులను శాంతింపజేయడానికి కాసేపు ఆగిపోయేవారు. ఇది క్రమంగా మూఢవిశ్వాసంగా పరిణమించింది.

అయితే ఈజిప్టులో నల్ల పిల్లిని గౌరవంగా చేస్తారు. ఎందుకంటే అది దేవత బాస్టెట్‌ను పోలి ఉంటుందని నమ్మేవారు.

బ్రిటన్‌లో నల్ల పిల్లి ఉన్న స్త్రీలు అదృష్టవంతులు అవుతారని నమ్ముతారు. జపాన్‌లో నల్ల పిల్లి ఇంటికి వస్తే శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.