పిల్లి ఎదురొస్తే అశుభమా.? వాస్తవం ఏంటంటే.?

07 October 2025

Prudvi Battula 

పురాతన విశ్వాసాల ప్రకారం.. పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయని భావిస్తారు. వీటిని ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదు.

పిల్లి ఎడమ నుంచి కుడి వైపునకు కదిలిన, ఏడ్చిన అశుభంగా భావిస్తారు. అలాగే కుడి నుంచి ఎడమ వైపునకు కదిలితే శుభసూచికమని అంటారు.

పూర్వకాలంలో ప్రజలు అడవి ద్వారా ప్రయాణం చేసేవారు. రహదారులు సరిగా లేనప్పుడు నడచుకుంటూ వెళ్లేవారు. చీకట్లో సైతం ప్రయాణాలు చేసేవారు.

ఆ సమయంలో వారి దారికి పిల్లి ఎదురొస్తే వెనుక ఏదో అడవి జంతువు ఉందని పసిగట్టి జాగ్రత్తపడి భద్రత ప్రదేశాల్లో తలదాచుకునేవారు.

రాత్రి వేళ పిల్లులు వేటాడుతుంటాయి. రాత్రిళ్లు వాటి కళ్లు భయంకరంగా ఉంటాయి. గుర్రాలు, ఎద్దుల బండ్లపై ప్రయాణం చేసే బాటసారులు రాత్రిపూట పిల్లి కళ్లను చూసి భయపడేవారు.

ఆ సమయంలో ప్రజలు తమ జంతువులను శాంతింపజేయడానికి కాసేపు ఆగి ప్రయాణం సాగించేవారు. ఇది క్రమంగా మూఢవిశ్వాసంగా మారింది.

ఈజిప్టు ప్రజలు తమ దేవత బాస్టెట్‌ను పోలి ఉన్నందున నల్ల పిల్లిని గౌరవంగా చూస్తారు. ఇది ఎదురుగా రావడం శుభప్రదంగా భావిస్తారు.

బ్రిటన్‌లో నల్ల పిల్లి పెంచిన స్త్రీలకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. జపాన్‌లో నల్ల పిల్లి ఇంటికి వస్తే శ్రేయస్సుగా భావిస్తారు.