పితృపక్షంలో మరణించడం శుభమా? అశుభమా తెలుసుకోండి!

13  September 2025

Samatha

పితృపక్షం వచ్చేసింది. ఈ సమయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేయడం వలన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది అంటారు పండితులు.

అందువలన ఈ సమయంలో చాలా మంది తమ పూర్వీకులకు పిండప్రధానం చేయడం చేస్తుంటారు. అంతే కాకుండా కొందరు పూర్వీకుల పేరు చెప్పి దానధర్మాలు చేస్తుంటారు.

అయితే ఈ సమయంలో కొందరు మరణిస్తుంటారు. దీంతో చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. పితృపక్షంలో మరణించడం మంచిదేనా?

ఈ సమయంలో మరణించడం వలన మంచి శుభమా? అశుభమా? ఇప్పుడు మరణించిన వారు నరకానికి వెళ్తారా? లేక స్వర్గానికి వెళ్తారా అని?

అయితే హిందూ పురాణాల ప్రకారం, పితృపక్షంలో ఎవరైనా మరణించడం శుభప్రదం అంట. శ్రాద్ధ దినాలలో మరణించిన వారు చాలా అదృష్ట వంతులంట.

వీరు మోక్షాన్ని పొందుతారంట. ఈ సమయంలో ఎక్కువగా తర్పణాలు చేస్తుంటారు. ఎందుకంటే? స్వరంద్వారాలు తెరుచుకొని ఉంటాయంట.

అందువలన పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తే వారు ఆనందంగా స్వర్గానికి వెళ్తారు, అలాగే, చనిపోయిన వారు కూడా నేరుగా స్వర్గానికే వెళ్తారంట.

నోట్ :  పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.