శనివారం నాడు భక్తితో శనీశ్వరుడిని పూజించడం వల్ల శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ధనలాభం కలుగుతుంది.
శనీశ్వరుడికి పూజ
శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి, శనీశ్వరుడికి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని పువ్వులు, నైవేద్యం సమర్పించి పూజ చేయాలి.
శనీశ్వరుడికి పూజ
శనివారం నాడు రావి చెట్టుకు పూజ చేయడం కూడా ధనలాభాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు. రావి చెట్టుకు నీళ్ళు పోసి, ప్రదక్షిణలు చేసి, దీపం వెలిగించి పూజించాలి.
రావి చెట్టుకు పూజ
లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. శనివారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ధనలాభం కలుగుతుంది.
లక్ష్మీదేవికి పూజ
లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం సమర్పించి పూజ చేయాలి. దీనివల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుంది.
లక్ష్మీదేవికి పూజ
విష్ణువుకి పూజ చేసిన మంచిదే. స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని గంగాజలం శుద్ధి చేసి విష్ణువు విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించిన పీఠంపై ఉంచండి.
విష్ణువుకి పూజ
నెయ్యితో దీపం వెలిగించి విష్ణువుకు పసుపు వస్త్రాలు, పువ్వులు, పండ్లు సమర్పించండి. విష్ణు స్తోత్రాలు, మంత్రాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఉపవాసం చేసిన మంచిదే.
విష్ణువుకి పూజ
శ్రావణమాసంలో శనివారం వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శనీశ్వర గ్రహ సంబంధింత బాధలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.