ప్యాన్ తలకిందులుగా ఉంచితే.. దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే.. 

06 October 2025

Prudvi Battula 

చాలామంది వంట కోసం ప్యాన్‌ను ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసి తలకిందులుగా తేమ పోవడానికి ఉంచడం చూసే ఉంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో ప్యాన్‌ను తలక్రిందులుగా ఉంచడం అంత మంచి కాదని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

రోటీ చేసిన తర్వాత శుభ్రం చేసిన ప్యాన్‌ను తలక్రిందులుగా ఉంచితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడి అప్పుల భారం పడవచ్చు.

వంటగదిలో ప్యాన్‌ను తలకిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

వంట కోసం ఉపయోగించిన ప్యాన్‌ను ఎల్లప్పుడూ కడగాలి. వాటిని మురికిగా ఉంచితే ఇంట్లో పేదరికం, సమస్యలు పెరుగుతాయి.

వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉన్న రాగి, ఉక్కు, కంచు, ఇత్తడి పాత్రలని పశ్చిమ దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

మీ వాడే ప్యాన్‌ను తలకిందులుగా ఉంచడం వల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలు వచ్చే ఆకాశం ఉందని అంటున్నారు పండితులు.

ప్యాన్‌ను తలకిందులుగా ఉంచితే కుటుంబ సభ్యుల పురోగతిలో ఆటంకాలు రావచ్చు. ఇంటి నుండి ఆనందం దూరమవుతుందని పండితుల మాట.