ఈ నియమాలు పాటిస్తేనే కరుంగాలి మాలతో శుభ ఫలితాలు..
25 September 2025
Prudvi Battula
ప్రస్తుతం సాధారణ మనుషుల నుంచి సెలెబ్రెటీస్ వరకు అందరు కరుంగాలి మాల వేసుకొంటున్నారు. ఇది శుభఫలితాలను అందిస్తుందని నమ్మకం.
కానీ కరుంగాలి మాల విషయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించినవారికి మాత్రమే ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు.
కరుంగలి మాలను ధరించిన వ్యక్తి అబద్ధం ఆడకూడదు. ఈ మల శని గ్రహం ప్రభావంతో ముడిపడి ఉన్నందున వాక్కు శుద్ధిని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
కరుంగలి మాల ధరించే ముందు, పదకొండు, ఇరవై ఒకటి, నలభై ఒక్క రోజులు ప్రతిరోజూ ఎనిమిది సార్లు "ఓం స్కందాయ నమః" అని జపించాలి.
బుధవారం, గురువారం. శుక్రవారం, శనివారం లేదా పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి వంటి రోజుల్లో మాలను ధరించడం శుభప్రదం.
మీరు టాయిలెట్ వెళ్ళేటప్పుడు ఈ మాలను తీసి పక్కన పెట్టాలి. తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని వేసుకోవాలి.
కరుంగలి మాలను ఎవరైనా ధరించవచ్చు. ఇది మన ఆరా (ఆత్మ)ను బ్యాడ్ ఎనర్జీ నుంచి రక్షిస్తుందని అంటున్నారు పండితులు.
కరుంగలి మాల ధరించినప్పుడు ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందగలం. లేదంటే ఎలాంటి లాభం ఉండదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..