శ్రావణమాసం శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమితో ముడిపడి ఉంది. చంద్రుడు శ్రవణ నక్షత్ర మండలానికి చేరువగా ఉండటం వల్ల ఈ మాసం ప్రత్యేకతను పొందింది.
ఈ మాసం అంతా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు పూజనీయమైనది. నేలంతా అనేక పూజలు చేసుకోవచ్చు అంటున్నారు పండితులు.
ప్రత్యేకంగా శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు చాలా ముఖ్యమైనవి. శివారాధన, మంగళగౌరీ వ్రతం, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రోజుల్లో జరుపుకోవడం ఆనవాయితీ.
హిందూ ధర్మంలో శ్రావణమాసం ఐదవ నెల. ఐదు అనే సంఖ్య లగ్నకుండలిలో సంతానానికి ప్రతీక. అందుకే ఈ మాసం సంతాన వృద్ధికి అనుకూలమైనదిగా భావిస్తారు.
సంతానం లేనివారు సంతానాన్ని పొందడానికి, ఉన్నవారు వారి సంతోషాన్ని పెంచుకోవడానికి ఈ మాసం అవకాశం కల్పిస్తుంది.
నాగపంచమి, నాగచతుర్థి వంటి ఉత్సవాలు కూడా సంతాన వృద్ధికి సంబంధించినవి. ఈ రోజుల్లో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.
కృత్రిమ సంతానం పెరుగుతున్న తరుణంలో సహజ సంతానం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో ఇవి సఫలం అవుతాయి.
శ్రావణమాసంలో శ్రీచక్ర సంపూర్ణ కరణ యుక్తంగా ఉండే శివశక్తి స్ఫటిక లింగం పూజకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి శక్తి, తేజస్సు, మనోధైర్యం పెరుగుతాయి.
పిల్లల మొండితనం, చెడు వ్యసనాల నుంచి బయటపడటానికి కూడా ఇది ఉపయోగకరమని వివరించారు. ఈ మాసంలో భగవంతునిపై విశ్వాసంతో సాధన చేయడం చాలా ముఖ్యం.
ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా దారిద్యం తొలగించుకోవచ్చు.