నెగిటివ్‌ ఆలోచనలు వస్తున్నాయా.? ఇలా చేస్తే పాజిటివిటీ వైఫైలా మీ చుట్టూ..

11 August 2025

Prudvi Battula 

మనలో చాలా మంది ఇంట్లో విరిపోయినవి, పగిలిపోయినవి అలాగే వాడుకుంటారు. లేదంటే అక్కడే ఓ మూలన పెట్టేస్తారు.

అయితే ఇలాంటి వస్తువులు ఉంటే నెగిటివ్‌ ఆలోచనలకు కారణం అవుతాయి. వీటిని వెంటనే ఇంట్లో నుంచి బయట పారేయడం మంచిది.

చాలామంది బెడ్‌ రూమ్స్‌లో అద్దాలు పెట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇక్కడ వీటిని ఉంచడం వల్ల నెగిటివ్‌ ఆలోచనలు వస్తాయి.

ఇక మనలో చాలా మంది వంట గదిలో ట్యాబ్లెట్స్‌ను పెట్టుకుంటున్నారు. కిచెన్‌లో ఎట్టి పరిస్థితుల్లో మందులను ఉంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

కిచెన్‌లో మందులను ఉంచడం వల్ల సైకలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇది నెగిటివ్‌ ఆలోచనలు తెస్తుంది.

ఇంట్లో నెగిటివ్‌ ఆలోచనలు పెరిగినా, నిత్యం ఏదో ఒకట గొడవ జరుగుతోన్నా.. అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే కచ్చితంగా తులసి మొక్కను పెంచుకోవాలి. తూర్పు దిశలో తులసి మొక్కను ఏర్పాటు చెయ్యడం మంచిది.

ఇక ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీని తరిమికొట్టాలంటే ఇంటి గుమ్మానికి ముందు గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.