పితృ దోషం గుర్తించడం ఎలా.? ఈ సింపుల్ రెమెడీస్‎తో సమస్య దూరం.. 

21July 2025

Prudvi Battula 

పూర్వీకుల ఫోటోలను నైరుతి గోడ మూలలో ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ఫోటో నవ్వుతున్నట్లుగా ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు.

ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే పూర్వీకుల కోపం ఫలితం కావచ్చు. ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేసి వారి ఫోటోలకు పూల మాలలు వేసి నమస్కరించుకోండి.

ఇది వారికి సంతోషాన్నివ్వటమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దోషాలను తొలగిస్తుంది. మీ పూర్వీకుల వార్షికోత్సవాన్ని ప్రత్యేక పద్ధతిలో జరుపుకోండి. ఈ రోజున చేసే దానాలు, పూజలు వారికి సంతోషాన్నిస్తాయి.

మీ కుటుంబంపై పితృదోషం ఉన్నట్టుగా తేలితె మరణించిన పెద్దలకు శాస్త్ర యుక్తంగా పిండ ప్రదానాలు, ఆర్థికలు క్రమం తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే..పితృదోషం తొలగిపోతుంది.

పితృదోషం ఉంటే చిన్న వారు అకాలమరణం పొందుతారు. శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ కావటం, వారు ఆస్పత్రి పాలుకావడం వంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది.

అప్పులపాలు కావడం, అపనిందలు మోయడం కూడా కుటుంబంపై పితృదోశం ఉన్నవారు ఎదుర్కొవాల్సి ఉంటుందని జ్యోతిశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచూ ప్రమాదాలకు గురికావటం కూడా పితృదోశంగా గుర్తించాలంటున్నారు. పండితుల సలహా మేరకు దోష నివారణ పాటించాలి.

పూర్వీకుల ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే.. పితృపక్షంలో వారిని నిష్టగా పూజించాలి. పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పక్షుల రూపంలో ఇంటికొస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.