అర్జునుడికి ఇన్ని పేర్లు ఉన్నాయా.? వాటి అర్థాలు ఏంటి.?

21July 2025

Prudvi Battula 

అర్జున: మహాభారతంలో అర్జునుడి అత్యంత సాధారణ పేరు, అందరికి తెలిసింది. "తెలుపు" లేదా "స్పష్టమైన" అని ఈ పెరుగు అర్ధం వస్తుంది.

ఫాల్గుణ: అర్జునుడి ఉన్న మరో పేరు ఫాల్గుణ. ఈ పేరు ఉత్తర ఫాల్గుణ నక్షత్ర రాశిలో అతని జన్మను సూచిస్తుంది.

జిష్ణు: అర్జునుడి ఈ పేరు కొందిమందికి మాత్రమే తెలుసు. ఇది అతని పరాక్రమాన్ని, శత్రువులకు చేరువ కాలేని శక్తిని సూచిస్తుంది.

కిరీటి: అర్జునుడు నివాతకవచ అనే రాక్షసులను ఓడించిన తర్వాత, దేవతల రాజు ఇంద్రుడు ఈ పేరు పెట్టిన్నట్టు పురాణాలు చెబుతున్నాయి.

బిభత్సు: ఈ పేరు కూడా కొందిమందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా యుద్ధంలో అన్యాయమైన పనులు చేయడం పట్ల అతనికి ఉన్న విరక్తిని సూచిస్తుంది.

సవ్యసాచి: ఈ పేరుకు అర్ధం రెండు చేతులతో సమాన నైపుణ్యంతో బాణాలు వేయగల సామర్థ్యం కలిగిన ద్వి నైపుణ్య విలుకాడు.

పార్థ: దినికి అర్ధం ఒక పితృ నామం, అంటే "కుంతి కుమారుడు". ఇది ఎక్కువగా పార్థసారధి (శ్రీకృష్ణుడు) పేరుతో కలిపి విని ఉంటారు.

ధనంజయ: ఈ పేరు ప్రభాస్ కల్కి సినిమా తర్వాత బాగా ఫేమస్ అయింది. దినికి "సంపదను జయించినవాడు" అని అర్ధం వస్తుంది.

బృహన్నల: దీని హంస అనే అర్ధం వస్తుంది. అజ్ఞాతవాసంలో విరాట్టును కొలువులో నపుంసకుడిగా ఉన్నప్పుడు ఈ పేరును స్వీకరించాడు.

విజయ ("ఎప్పటికీ విజయం సాధించేవాడు" లేదా "విజేత"), గుడాకేష్ (ఇంద్రియాలపై నియంత్రణ కలిగినవాడు), శ్వేతవాహన (తెల్ల గుర్రాలతో ఉన్నవాడు) అనే మరో మూడు కూడా ఉన్నాయి.