దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించడం మంచిదంటే?

19 october 2025

Samatha

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇక 2025వ సంవత్సరంలో దీపావళి అక్టోబర్ 20 సోమవారం రోజున రావడం జరిగింది. దీంతో ఈరోజు ప్రతి ఒక్కరూ దీపావళి జరపుకుంటారు.

ఈ పండుగ రోజు చాలా మందిలో అనేక డౌట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

ఇక దీపావళి పండుగ రోజున కొందు తమ ఇంటిలోపల ఐదు దీపాలు వెలిగిస్తే, మరి కొంత మంది తొమ్మిది దీపాలు వెలిగిస్తారు. కానీ ఈరోజు 11 దీపాలు వెలిగించడం మంచిదంట.

దీపావళి పండగ రోజున లక్ష్మీ దేవి పూజ తర్వాత, మీ పూజ గదిలో దీపం వెలిగించాలంట. దీని వలన ఇంటిలో సంపద పెరగడమే కాకుండా ఇంటివారి ఆరోగ్యం బాగుటుందంట.

తర్వాత తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్క వద్ద దీపం పెట్టాలంట. దీని వలన ఇంటిలోపలికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట.

హిందూ మతంలో రావిచెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అయితే తులసి చెట్టు తర్వాత రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలంట.

దీని తర్వాత బావి లేదా చెరువు, ఆ తర్వాత బిల్వ వృక్షం కింద, ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద, తర్వాత ఇంటి పై కప్పు తర్వాత, ఇలా11 స్థానాల్లో 11 దీపాలు పెట్టాలంట.