గణేష్ చతుర్థి స్పెషల్: వినాయకుడికి ప్రీతికరమైన 9 నైవేద్యాలు ఇవే
samatha
11 september 2026
Pic credit - Pinterest
ప్రతి ఒక్క రికీ ఇష్టమైన గణేష్ పండుగ వచ్చేస్తుంది. సెప్టెంబర్ 14న ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.
ఇక వినాయక చవితి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ప్రసాదాలు. ప్రతి ఒక్కరూ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు చేస్తుంటారు.
కొంత మది తమకు నచ్చిన ప్రసాదాలు చేస్తుంటారు. కానీ కొన్ని ప్రసాదాలు గణపయ్యకు చాలా ఇష్టమంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం మోదకాలు. వాటిని ప్రసాదంగా పెట్టడం వలన వినాయకుడు చాలా ఆనందిస్తాడంట.
అంతే కాకుండా ఆ తర్వాత ఉండ్రాళ్లు వినాయకుడికి చాలా ఇష్టం. వాటిని గణపయ్యకు సమర్పిస్తే, ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
వినాయకుడికి 108 సంఖ్యలో ఉండ్రాళ్లను సమర్పించడం వలన ఆయన సంతోషిస్తాడంట. అంతే కాకుండా కోరిన కోరికను నెరవేర్చుతాడని చెబుతున్నారు పండితులు.
ఉండ్రాళ్ల తర్వాత వినాయకుడు లడ్డూలను చాలా ఇష్టంగా తింటాడు. అందువలన వినాయకుడికి లడ్డూలను సమర్పించడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
పానకం, పాయసం, వడపప్పు, పర్వన్నం ఇవన్నీ కూడా గణనాథుడికి చాలా ఇష్టమైన, ప్రీతికరమైన ప్రసాదాలు. వీటిని సమర్పిస్తే ఆ గణపయ్య అనుగ్రహిస్తాడంట.