నేడు ( ఫిబ్రవరి 27)న మాఘ అమావాస్య. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా శక్తివంతమైనది అంటారు పండితులు.
అయితే ఈ మాఘ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.
మరీ ముఖ్యంగా ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యత లోపించినట్లైనా, ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నా? అలాంటి వారు నేడు తప్పకుండా ఈ పరిహారాలు చేయాలంట.
ఈరోజు ఒక గాజుగిన్నె తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసి మీ ఇంట్లోని ముఖద్వారం వద్దా పెట్టి మరసటి రోజు ఆ నీరు తీసుకొని, బయటపారబోయాలంట.
దీని వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి, సమస్యలన్నీ తొలిగిపోతాయి. అంతే కాకుండా ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
అంతే కాకుండా, నేడు నల్లదారాన్ని ఎడమ కాలికి కట్టుకోవడం వలన నర దిష్టి దోషాలు తొలిగిపోతాయంట. చాలా రోజుల నుంచి పీడిస్తున్న అనారోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతే కాకుండా ఈ రోజు మీరు రావి ఆకులను తీసుకొచ్చి, మీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన చాలా శుభ సూచకం అంట. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగి పోయి ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు.
అలాగే ఈ అమావాస్య రోజున లక్ష్మీ దేవి ముందు నెయ్యి దీపం వెలిగించడం వలన కూడా ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి అంటున్నారు పండితులు.