కార్తీక అమావాస్య .. ఈ ఒక్క రోజూ ఈ పని చేస్తే సకల సంపదలు మీ సొంతం!
Samatha
19 November 2025
కార్తీక అమావాస్య వచ్చేస్తుంది. అయితే ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసం కార్తీక అమావాస్యతో ముగుస్తుంది.
అయితే కార్తీక అమావాస్య రోజున శ్రీ హరి విష్ణువు, లక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు పండితులు.
అంతే కాకుండా ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు చేయడ కూడ చాలా మంచిదంట. దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుందంట. దాని గురించి తెలుసుకుందాం.
కార్తీక అమావాస్య రోజున ఎవరైతే తమ పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారో వారికి పితృదోషం తొలిగిపోయి, సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.
కార్తీక అమావాస్య 2025వ సంవత్సరంలో నవంబర్ 20న వస్తుంది. అయితే ఈ రోజున ఎవరైతే శివాలయం లేదా, లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి.
అంతే కాకుండా చాలా మంది చిన్న చిన్న అడ్డంకుల వలన కార్తీక దీపం వెలిగించరు. అయితే అలాంటి వారు అమావాస్య రోజు దీపం పెట్టడం చాలా శుభ ప్రదం.
ఇక ఎవరైతే కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన 108 నామాలను జపిస్తారో వారు అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు పండితులు.
పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.