కృష్ణాష్టమి రోజు ఇలా చేస్తే.. అదృష్టం మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టే..

08 August 2025

Prudvi Battula 

కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని భక్తితో ప్రార్థనలు చేసి పూజించడం వల్ల ఆశీస్సులు, అదృష్టం, శ్రేయస్సు లబిస్తుంది.

కృష్ణాష్టమికి ఉపవాసం ఉండి ధ్యానం చేయడం వల్ల మీ మనస్సు, శరీరం శుద్ధి చేయబడి సానుకూల శక్తులను పొందగలుగుతారు.

ఈ రోజున అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యడం వల్ల ఆ గోవర్ధన ధారుణి ఆశీస్సులతో అదృష్టాన్ని పొందుతారని నమ్ముతారు.

ఈ రోజున మీ ఇంటిని అందంగా సంప్రదాయబద్ధంగా పూలు, అరటి చెట్లు, మామిడి కొమ్మలతో అలంకరిస్తే అదృష్టం లభిస్తుంది.

కృష్ణాష్టమి రోజు భగవద్గీత చదవడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని కృపకు పాత్రులు అవుతారు.

శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ భక్తి పాటలు, భజనలు చేయడం కూడా మంచిదే. దీనివల్ల మీ శరీరానికి సానుకూలత లభిస్తుంది.

కృష్ణాష్టమి రోజున తల్లిదండ్రులు, గురువులు పెద్దలకు గౌరవం, వినయం చూపిస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అదృష్టం వస్తుంది.

కృష్ణాష్టమికి ఆకుపచ్చ అవెంచురిన్, సిట్రిన్ వంటి అదృష్టానికి సంబంధించిన రత్నాలను ధరించడం శుభప్రదంగా భావిస్తారు.