శ్రీరాముడిని ఏ పూలతో పూజిస్తే కలిసి వస్తుందో తెలుసా?

samatha 

5 april 2025

Credit: Instagram

శ్రీరామ నవమి వచ్చేసింది. ఏప్రిల్ 6న  ఘనంగా దేశమంతటా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాలు జరుపుతుంటారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో రాములోరిని పూజిస్తారు.

చైత్ర శుద్ధనవమి రోజున శ్రీరాముడి కళ్యాణం జరపడం జరుగుతుంది. ఈ రోజు శ్రీరాముడి నామజపం చేస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు.

శ్రీరామనవమి రోజు శ్రీసీతారాముల కళ్యాణమే కాకుండా, ఈ రోజు లక్ష్మణ , భరత, ఆంజేయస్వాముల వారిని కూడా ఆరాధించాలంట. దీని వలన మంచి జరుగుతుంది.

అదే విధంగా శ్రీరామ నవమి రోజున బ్రహ్మముహుర్తంలో లేసి, శ్రీరాముల వారికి పూజ చేసి దీపారాధన చేయడం వలన సకల శుభాలు కలుగుతాయంట.

ఇక శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ.. దగ్గరిలోని రామాలయానికి వెళ్లి, సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది.

అయితే ఈ రోజున శ్రీరాముడిని మల్లెపూలతో పూజించడం చాలా మంచిదంటున్నారు పండితులు. మల్లెపూలు స్వచ్ఛతకు గుర్తు, అందువలన ఈ పూలతో పూజించాలంట.

చైత్ర మాసం మల్లెల మాసం అంటారు. అందువలన శ్రీ సీతారాములను కూడా మల్లెపూలతో పూచిస్తే శుభప్రదం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

ఒక వేళ మల్లెపూలు లేని యెడల దగ్గరలోని ఏవైనా సువాసన గల తెల్లటి పూలతో సీతారాములు, ఆంజనేయుడు, లక్ష్మణులను పూజించాలంట.