దుర్గామాతను ఏ పూలతో పూజిస్తే అదృష్టం కలుగుతుందో తెలుసా? 

19 September 2025

Samatha

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి పల్లె పట్నంలోని దేవాలయాలు,   దుర్గామాత ఉత్సవాలతో మార్మోగి పోనున్నాయి.

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు.

ఇక దుర్గామాతను నిష్టగా పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతుంటారు పండితులు. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన వాటితో పూజించడం చాలా మంచిదంట.

అయితే అమ్మవారిని ఏ పూలతో పూజిండం మంచిది? ఏ పూలతో అమ్మవారిని పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

దుర్గామాతకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువలన ఈ అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించడం వలన చాలా మంచి జరుగుతుందంట.

ఎరుపు రంగు శక్తి, తేజస్సు, ప్రేమకు ప్రతీక. అందువలన అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

పురాణాల ప్రకారం, ఎర్రటి వస్త్రం, ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించడం వలన దేవి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుందంట.

అందువలన ఇంట్లో సుఖ, శాంతులు, శ్రేయస్సు, ఆనందం కలగాలి అంటే నవరాత్రుల సమయంలో దుర్గామాతను ఎర్రటి పూలతో పూజించాలంట.