ఈ మొక్కను పూజిస్తే కష్టాలన్నీ పోతాయంట.. కానీ ఎప్పుడు పూజించాలో తెలుసా?
17 January 2025
samatha
మన హిందూ మతంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉంటుంది. దీనిని దేవతగా భావిస్తూ ప్రతి రోజూ మహిళలు ఈ తులసి మొక్కను నిష్టగా పూజిస్తుంటారు.
ముఖ్యంగా తులసి చెట్టులో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని, అందువలన తులసిని పూజించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అంటారు.
అయితే మాఘమాసంలో తులసి చెట్టును పూజించడం చాలా మంచిది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఈ మాసంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంటుందంట.
అలాగే మాఘమాసంలో తులసి మొక్కను పూజించడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి, కష్టాలన్నీ పోయి, ఇంట ఆనందం, సంతోషాలు విల్లివిరుస్తాయంట.
అయితే తులసి పూజ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలంట. లేకపోతే కొత్త సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో, ముఖ్యంగా ఉప్పు, పాలు, చెరుకు రసం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మొలగాలంట.తులసి మొక్కకు చెరుకు రసం పోయడం, నీరు పాలు కలిపి పోయడం చేయకూడదంట.
అదే విధంగా ఉప్పును తులసి చెట్టుకు వేయకూడదంట, అంతే కాకుండా తులసి మొక్కకు రాత్రి పూట నీరు అస్సలే పెట్టకూడదంట. ఇలా జాగ్రత్తలు పాటించడం వలన ఎలాంటి సమస్యలు దరిచేరవు.