ఎప్పుడూ పెట్టుకునే బొట్టు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
samatha
15 February 2025
Credit: Instagram
హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకోవడం తప్పని సరి. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ నొదుట ఎప్పుడూ బొట్టు పెట్టుకునే ఉంటారు.
అంతే కాకుండా ప్రతి మహిళా బొట్టు పెట్టుకోవాలని చెబుతారు. దీని వలన ముఖం ఎంతో కళగా కనిపిస్తుంటుంది.చూడటానికి చాలా బాగుంటుంది.
ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు అస్సలే బొట్టులేకుండా ఉండకూడదు అంటారు. బొట్టులేకుండా ఉండే స్త్రీలను చూడటం కూడా అరిష్టం అని పురాణాలు చెబుతుంటాయి.
ఇక ఈ బొట్టుపెట్టుకోవడం వలన కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. అంతే కాకుండా బొట్టుకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో పెట్టుకోవాలంట. ఇక దేవుడి ఫొటోలకు బొట్టు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఉంగరపు వేలితో మాత్రమే పెట్టాలంట.
ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలితో పెట్టాలి. అలా కాకుండా మధ్యవేలు లేదా ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వస్తాయంటున్నారు పండితులు.
అలాగే బొట్టు పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్టీ వస్తుందంట. అంతే కాకుండా అది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఏకాగ్రత పెరుగుతుందంట.
ఇక కొందరు కొన్ని సార్లు బొట్టు పెట్టుకోరు, కానీ నది స్నానం ఆచరించే సమయంలో, పితృకర్మలు చేసే సమయంలో తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి అంటున్నార పండితులు.