దీపావళి రోజున దీపాలు ఎలా వెలిగించాలో తెలుసా?

13 october 2025

Samatha

దీపావళి పండుగ వచ్చేస్తుంది. అక్టోబర్ 21న తెలుగు ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చాలా మందికి ఈ పండుగ అంటే ఇష్టం ఉంటుంది.

ఇక దీపావళి పండుగ అంటే చాలు అందరికీ దీపాలు, టపాసులే గుర్తు వస్తుంటాయి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి, ఇంటి నిండా దీపాలు పెడుతుంటారు.

ఇక దీపాలు ఎవరికి నచ్చినట్లు వారికి వెలిగించుకుంటారు.  కానీ దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించడానికి ఓ పద్ధతి ఉంటుందంట. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

దీపావళి పండుగ సమయంలో ఎప్పుడు కూడా లక్ష్మీ, గణేశ పూజ సమయంలో దీపాలను నేరుగా నేలపై పెట్టకూడదంట.  దీని వలన  సమస్యలు తలెత్తుతాయంట.

ఏదైనా ఆసనం పైనా లేకపోతే పువ్వులు లేదా, అక్షంతలు పైన దీపం వెలిగించి పెట్టాలంట.   ఇలా పెట్టడం వలన ఎలాంటి సమస్యలు దరిచేరవు.

అదే విధంగా దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి తూర్పు దిశలు ధనానికి ఉత్తర దిశలో వెలిగించడం మంచిది.

నేతి దీపంలో పత్తి వత్తిని ఉంచి దీపం వెలిగించడం శ్రేయస్కరం.  దీపావళి పండుగ రోజు ఎప్పుడు దీపం వెలిగించినా పత్తి వత్తినే ఉపయోగించాలంట.

అదే విధంగా నూనె దీపంలో ఎర్రటి దారం పెట్టి వత్తిని వెలిగించాలంట.  అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో దీపావళి రోజున పగలిన దీపాలు, పాతవి వెలిగించకూడదంట.