శ్రీరాముడు తన పాపాలను పోగొట్టుకోవడానికి తయారు చేసిన శివలింగం ఇదే.. ఎక్కడుందంటే?

Samatha

8 november 2025

శ్రీరాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాముడి జీవితం ప్రతి ఒక్కరికీ పరమవేదం. అయితే ఈయన తన చేతులను శివలింగాన్ని ప్రతిష్టించారని చెబుతుంటారు.

అయితే ఆయన తన చేతులతో స్వయంగా ప్రతిష్టించిన శివలింగం ఇప్పుడు ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా వెలుగొందుతుంది. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

శ్రీరాముడు, రావణుడు అయినా బ్రాహ్మణుడిని చంపిన విషయం తెలిసిందే. అయితే బ్రహ్మ హత్య చేసినందుకు ఆయనపై బ్రహ్మ హత్యా పాపం మోపడం జరిగింది.

దీంతో ఆయన ఆ పాపం తొలిగించుకోవడానికి భరద్వాజ మహర్షి రామునిన సంప్రదించారు. దీంతో ఆయన కోటి శివలింగాలను తయారు చేసి పూజిస్తే ఆ పాపం తొలిగిపోతుందని చెప్తాడంట.

అప్పుడు, శ్రీరాముడు అయోమయానికి గురి అవుతాడంట. ఈ కలియుగంలో ఇన్ని శివలింగాలను పూజించలేము, వాటిని ఎలా తయారు చేస్తారని ప్రశ్నిస్తాడంట.

అప్పుడు రాముడి మాటలు విన్న మహర్షి, రెండు చేతుల్లోని ఇసుక రేణువులతో శివలింగాన్ని తయారు చేయమని చెప్తాడంట. అందులో కోటి ఇసుక రేణువులు ఉంటాయి.

దీంతో పరిష్కారం తెలుసుకున్న శ్రీరాముడు, మహర్షి చేతుల్లోని కోటి ఇసుక రేణువులతో లింగాన్ని తయారు చేసి పూజిస్తాడంట. అలా శ్రీరాముడు కోటి లింగాలను పూజించే అదృష్టాన్ని పొందుతాడు.

అందుకే శ్రీరాముడి తయారు చేసిన ఆ లింగానికి కోటేశ్వర  మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. ఇది ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లోని శివకుటి ప్రాంతంలో ఉంది.