అమ్మవార్లకు బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తారు. శివసత్తుల ఆటలు, పోతరాజుల వీరంగంతో హైదరాబాద్ మారుమోగుతుంది.
అయితే అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బోనాల పండుగ అంటే ఏమిటి? ముఖ్యంగా బోనం అంటే ఏమిటో?
కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. అసలు బోనం అంటే ఏమిటి? దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.
బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం అంట. దేవతలకు పెట్టే నైవేద్యం బోనం. దీనిని మట్టి కుండలో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో వండుతారు.
ఒక్కో దేవతకు ఒక్కో రకమైన బోనం వండుతారు. కొందరికి పసుపు, బియ్యంతో బోనం చేస్తే మరికొందరికి చక్కెర, కొత్త బియ్యం, బెల్లం, బియ్యంతో చేస్తారు
అలాగే బోనాన్ని పసుపు,నూనె కలి, బోనం చుట్టూ పూసి, పసుపు,కుంకుమ , పిండితో అందంగా అలంకరిస్తారు. దానికి వేపకొమ్మలు కట్టి అందంగా తయారు చేస్తారు.
భాగ్యనగరంలో 1813లో ఒక వ్యాధితో చాలా మంది మరణించారు. అప్పుడు మహాంకాళి అమ్మవారికి పూజలు చేయడంతో వ్యాధి తగ్గింది. అప్పటి నుంచి బోనాలు చేయడం ప్రారంభించారు.