చాణక్య నీతి : తెలివైన వ్యక్తులు చేసే ఈ తప్పులే జీవితాన్ని కష్టాల్లో పడేస్తాయి!
Samatha
19 November 2025
ఆ చార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. చాణక్యుడు గొప్ప గురువు, రాజకీయ వేత్త.
ఆచార్య చాణక్యుడి ఆలోచనలు, విధానాలు నేటి తరం వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అవి ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉన్నాయి.
ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆయన తెలివైన వ్యక్తి చేసే చిన్న పొరపాట్ల
గురించి తెలిపాడు.
కాలం కంటే గొప్పది ఏదీ లేదు. కానీ చాలా మంది తెలివైన వ్యక్తులు కూడా కొన్ని సార్లు సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇంటలీజెంట్స్ చేసే అతి పెద్ద తప్
పు ఇదేనంట.
కొంత మంది సమయం విలువను అర్థం చేసుకోకుండా ఆ రోజు చేయాల్సిన పనిని మరసటి రోజుకు వాయిదా వేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదంట.
అదే విధంగా, తెలివైన వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు, మధురమైన మాటలకు లొంగిపోవడం, తప్పుడు వ్యక్తులను నమ్మడం.
ఎప్పుడైనా సరే ఎదుటి వారి మధురమైన మాటలను , వారిని గుడ్డిగా నమ్మకూడదు. ఇలా చేయడం వలన మీరు చాలా నష్టపోవాల్సి
వస్తుందంట.
అత్యంత తెలివైన వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు తమ లోపాలను దాచడం. ఎవరైతే తమ లోపాలను దాస్తుంటారో వారు విజయాన్ని అందుకోలేరంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి వాల్ పేపర్ మీ మొబైల్కు ఉంటే, జాతకంలో గ్రహదోషాలే!
మహిళల కలలో మంగళ సూత్రం కనిపించడం శుభమా? అశుభమా?
రాత్రి పూట లైట్స్ వేసుకొని నిద్రపోతున్నారా?