చాణక్య నీతి : కూతురు ఉన్న ఏ తండ్రి పొరపాటున కూడా చేయకూడని పనులివే!
08 october 2025
Samatha
ఆ చార్య చాణక్యుడు మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఈయనకు ఎన్నో అంశాలపై మంచి పట్టు ఉంది. అందుకే నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది.
ఇక చాణక్యుడు బంధాలు బంధుత్వాల గురించి తన నీతి శాస్త్రంలో గొప్పగా తెలియజేశాడు. అలాగే ఆయన తండ్రి కూతుళ్ల ప్రేమ, కూతురు ఉన్న తండ్రి చేయకూడని పొర పాట్ల గురించి తెలియజేశాడు.
చాణక్యుడు మాట్లాడుతూ, ఆడపిల్లలు ఉన్న ప్రతి తండ్రి పొరపాటున కూడా కొన్ని విషయాలను విస్మరించవద్దు. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
చాణక్య నీతి ప్రాకారం ప్రతి తండ్రి తన కూతురు కోరికలను అస్సలే విస్మరించకూడదంట. కూతురు కలలు , భావాలను అర్థం చేసుకోవడం, గౌరవించడం తండ్రి బాధ్యతంటే.
అదే విధంగా, కూతురు వివాహం విషయంలో కూడా తండ్రి తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ఆమె విద్య, వృత్తి వంటివి దృష్టిలో పెట్టుకొని వరుడిని చూడాలంట.
చాలా మంది తల్లిదండ్రులు తమ కూతురిని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. తన ప్రతి పనిలో అడ్డుపడతారు. కానీ దీని వలన ఆమె మానసికంగా కుంగిపోతుందంట.
కూతురికి తండ్రి అంటే అమితమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. కాబట్టి తండ్రి ఎప్పుడు తన కూతురు వద్ద అబద్ధాలు చెప్పడం, ఆమె ముందు అగౌరవంగా మాట్లాడటం చేయకూడదంట.
అదే విధంగా కూతురిని రక్షించడం తండ్రి బాధ్యత అంటున్నాడు చాణక్యుడు. తమ కూతురిని రక్షించుకోవడం తండ్రి బాధ్యత దీని విషయంలో ఎప్పుడూ తండ్రి నిర్లక్ష్యంగా ఉండకూడదట.